బంగారుపాళెం/తవణంపల్లె : మండలంలోని బొమ్మాయిపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు మధునాయుడు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్, పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ సిద్ధాంతాలు, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వ లక్షణాలకు ఆకర్షితుడై వైఎస్సార్ సీపీలో చేరినట్లు మధునాయుడు తెలిపారు. అలాగే తవణంపల్లె మండలంలోని కొండ్రాజుకాలువ పంచాయతీ మడవనేరి కృష్ణాపురానికి చెందిన బుజ్జినాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. దిగువమాఘం సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి ఉష, వైఎస్సార్ సీపీ నేతలు ప్రకాష్‌రెడ్డి, భాస్కర్‌నాయుడు, కుమార్‌రెడ్డి, సాయి రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తామంతా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తామని బుజ్జినాయుడు తెలిపారు.
బైరెడ్డిపల్లెలో
బైరెడ్డిపల్లె : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు. దీంతో కూటమినేతల్లో గుబులు మొదలైంది. మండల కేంద్రమైన బైరెడ్డిపల్లె–2 సెగ్మెంట్ నుంచి 17 కుటుంబాల టీడీపీ నేతలు ఆదివారం మాజీ ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే నాగిరెడ్డిపల్లెకు చెందిన రఘుపతి, రాజప్ప, హరీష్, రెడ్డెప్ప, లక్ష్మప్ప, సతీష్, పరమేష్, కృష్ణమూర్తి, నాగరాజు, రమేష్, మంజునాథ్, దేవరాజులు, శ్రీనివాసులు, శివయ్య, వెంకటేష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. అదేవిధంగా టీడీపీ బైరెడ్డిపల్లె మాజీ మైనార్టీ అధ్యక్షుడు సాధత్ కుటుంబం ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరింది.


