ఓటుతో బాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి | - | Sakshi
Sakshi News home page

ఓటుతో బాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

● వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆదరించండి ● స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపు

పుత్తూరు: ప్రతి పేద కుటుంబం బాగుకోసం ఆలోచించే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా విజ్ఞప్తి చేశారు. ఆదివారం తడుకు ఎంపీటీసీ సెగ్మెంట్‌లోని వీఎస్‌ఎస్‌పురంలో ఆదివారం ఆమె ప్రచారం నిర్వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ పేరిట ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రభుత్వానికి ఓటుతో సమాధానం చెప్పాలని గ్రామస్తులను కోరారు. వైఎస్సార సీపీ ప్రభుత్వ పాలనలో అమలైన సంక్షేమ పథకాల గురించి వివరించారు. పల్లె ప్రజల కోసం ప్రతి పంచాయతీలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల భవనాలను నిర్మించారని గుర్తు చేశారు. పల్లె ప్రజలు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా పార్టీ అభ్యర్థులను బలపరచాలని కోరారు. తడుకు, రామకృష్ణాపురం ఎంపీటీసీ అభ్యర్థులు శివ వినూత, జెడ్పీటీసీ అభ్యర్థి ప్రతాప్‌కు ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement