ఉపసంహరణల పర్వం | - | Sakshi
Sakshi News home page

ఉపసంహరణల పర్వం

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

11 మంది జెడ్పీటీసీ, 297 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ నేడు సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు నేడే బరిలోని అభ్యర్థుల జాబితా ప్రచురణ

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉపసంహరణల వివరాలు ఇలా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని 27 జెడ్పీటీసీ, 370 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పలువురు డమ్మీ, స్వతంత్ర, రెబల్స్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌ కుమార్‌ గాంధీ, ఆయా మండలాల ఆర్‌వోల సమక్షంలో ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన పూర్తయిన తర్వాత అభ్యర్థుల ఉపసంహరణల ప్రక్రియ మొదలైంది. సోమవారం వివిధ నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు, రెబల్స్‌, స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను అధికారికంగా ఉపసంహరించుకున్నారు. సోమవారం సాయంత్రం 5.44 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించిన సమాచారం మేరకు జిల్లాలో జెడ్పీటీసీ స్థానాల నుంచి 11 మంది, ఎంపీటీసీ స్థానాల నుంచి 297 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు.

జెడ్పీటీసీ స్థానాల్లో ఇలా..

జిల్లాలోని మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొదట 181 మంది అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలో 7 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం సోమవారం నాటికి 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకున్న వారిలో కుప్పం మండలంలో అశ్విని, సుశీల, గంగవరంలో రామభద్రనాయుడు, పులిచెర్లలో జాఫర్‌హుస్సేన్‌, పూతలపట్టులో నరసంహులు నాయుడు, పెద్దపంజాణిలో రెడ్డెప్పరెడ్డి, హరిత, బంగారుపాళెంలో రమణమ్మ, వి.కోటలో సూర్యమూర్తి, శాంతిపురంలో జనార్దన్‌, నిండ్రలో గిరిబాబు ఉన్నారు.ఉపసంహరణ ప్రక్రియ ఈ నెల 27 వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉండడంతో మరికొంత మంది నామినేషన్లను ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం.

ఎంపీటీసీ స్థానాల్లో ఇలా..

జిల్లాలోని 370 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్లలో తిరస్కరణ అనంతరం 1,788 నామినేషన్లు చెల్లుబాటు అయ్యేవిగా తేలాయి. కాగా సోమవారం సాయంత్రం 5.44 గంటల వరకు 297 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కు తీసుకున్నారు. కాగా సోమవారం సాయంత్రం వరకు అధికారులు వెల్లడించిన వివరాల మేరకు 1,491 మంది బరిలో ఉన్నారు. కాగా వీరిలో మరికొంతమంది మంగళవారం సాయంత్రం వరకు నామినేషన్లను ఉపసంహరించుకున్న తర్వాత బరిలో ఉండే ఎంపీటీసీ అభ్యర్థుల తుది జాబితా తెలియనుంది.

నేడే చివరి అవకాశం

నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 3.00 గంటల వరకు గడువు ముగియనుంది. ప్రధాన పార్టీల రెబల్స్‌ను, స్వతంత్రులను పోటీ నుంచి తప్పుకునేలా చేసేందుకు ఆయా రాజకీయ పార్టీల ముఖ్య నేతలు చివరి నిమిషం వరకు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రం 3 గంటల అనంతరం పరిషత్‌ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

విభాగం టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఇండిపెండెంట్స్‌

జెడ్పీటీసీలు 03 01 – – 07 (డమ్మీ నామినేషన్లు) 01

ఎంపీటీసీలు 147 08 02 02 126 (డమ్మీ నామినేషన్లు) 12

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement