వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

– 8లో

ఎన్నికల్లో నిబంధనలు ముఖ్యం
ఎన్నికల విధుల్లో అధికారులు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని డీఆర్వో మోహన్‌కుమార్‌ తెలిపారు.

కాణిపాకం: పౌర్ణమి సందర్భంగా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామి ఆలయంలో సోమవారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో స్వామివారికి విశేష అభి షేకాలు, అలంకారాలు చేసి శాస్త్రోక్తంగా వ్రత క్రతువును పూర్తిచేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

చిత్తూరులో ముమ్మరంగా లాడ్జిల తనిఖీలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం లాడ్జిల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా టూ టౌన్‌ సీఐ మొహమ్మద్‌ హాషమ్‌ తన పరిధిలోని లాడ్జిల్లో సోదాలు నిర్వహించి, బసచేసిన వారి వివరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల వేళ అక్రమ నగదు, మద్యం రవాణా జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని సీఐ తెలిపారు. లాడ్జి నిర్వాహకులు బసచేసే వారి ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement