రూ.31 కోట్లతో | - | Sakshi
Sakshi News home page

రూ.31 కోట్లతో

Oct 23 2026 1:57 AM | Updated on Oct 23 2026 1:57 AM

చిత్తూరు రైల్వే స్టేషన్‌ అభివృద్ధి

చిత్తూరు కార్పొరేషన్‌: అమృత్‌భారత్‌ పథకం కింద రూ.31 కోట్లతో చిత్తూరు రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్టు గుంతకల్‌ రైల్వే డివిజన్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆయన గురువారం చిత్తూరు రైల్వేస్టేషన్‌లో భారతీయ రైల్వే ఆధ్వర్యంలో జన సంవాద్‌ కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్‌ను పరిశీలించి, ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం స్టేషన్‌లో అధునాతన పార్కింగ్‌, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, ఏసీ వెయిటింగ్‌ హాళ్లు, రిటైరింగ్‌ రూములు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. చిత్తూరుతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ పథకం కింద ఆధునికీకరిస్తున్నట్టు వివరించారు. చిత్తూరు నుంచి చైన్నెకి రైలు సౌకర్యం కల్పించాలని స్థానికులు విన్నవించారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని సత్యనారాయణ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కమర్షియల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ అతిశయ తదితరులు పాల్గొన్నారు.

దాడి ఘటనపై కేసు నమోదు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగి జీవన్‌పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అధికారులు, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించారు. డీడీ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు గురువారం పోలీసులు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దౌర్జన్యం చేసి, దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పరిసర ప్రాంతాల సీసీటీవీ పుటేజ్‌లను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement