25న పారా అథ్లెటిక్స్‌ జిల్లా చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

25న పారా అథ్లెటిక్స్‌ జిల్లా చాంపియన్‌షిప్‌

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

● ఓటరు జాబితాలో పేరును పరిశీలించుకోవాలి. సీఈఓఆంధ్ర.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా స్థానికంగా ఓటరు నమోదు కేంద్రంలో పరిశీలించుకోవచ్చు. ● ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఫొటో గుర్తింపు కార్డు, ఓటరు చీటీ మీ వద్ద ఉంచుకోవాలి. ● మీ ఇంటి వద్దకే బూత్‌స్థాయి అధికారులు వచ్చి ఓటరు చీటీ ఇచ్చి వెళతారు. ● ఒకవేళ ఓటరు చీటీ ఇవ్వకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉండే రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద పొందవచ్చు. ● పోలింగ్‌ కేంద్రం వద్ద మీ ఓటరు చీటీ, గుర్తింపు కార్డును చూపించాలి. ● పోలింగ్‌ అధికారి ఓటరు జాబితాలో గుర్తింపు కార్డుతో పాటు మీ పేరును పరిశీలిస్తారు. మరో అధికారి మీ వేలికి ఇంక్‌ అంటిస్తారు. ఆ తర్వాత ఒక చీటీ ఇస్తారు. మూడో అధికారి ఆ చీటీని పరిశీలిస్తారు. ● తర్వాత ప్రధాన అధికారి బ్యాలెట్‌ పేపరు ఇచ్చి దానిని ఎలా మడిచి బ్యాలెట్‌ బాక్సులో వేయాలని వివరిస్తాడు. ● బ్యాలెట్‌ పేపరును తీసుకొని ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి (ఓటింగ్‌ రూంలోకి) వెళ్లాక అక్కడ ఏర్పాటు చేసిన స్వస్తిక్‌ గుర్తు స్టాంపుతో మీరు ఓటు ఎవరికి వేయాలనుకున్నారో దానిపై ఆ గుర్తును వేయాలి. ● అనంతరం బ్యాలెట్‌ పేపరును నిలువుగా మడిచిన తర్వాత అడ్డంగా మడిచి అక్కడే ఉన్న బ్యాలెట్‌ బాక్సులో వేసి బయటకు రావాలి.

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరులోని మెసానికల్‌ మైదానంలో ఈ నెల 25వ తేదీన జిల్లా స్థాయి జూనియర్‌, సబ్‌ జూనియర్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ నిర్వహించున్నారు. ఈ మేరకు సోమవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తలారి మోహన్‌బాబు, కార్యదర్శి పురుషోత్తం రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలోని దివ్యాంగ క్రీడాకారులు (పారా అథ్లెట్లు) ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. అర్హత, ఆసక్తి గల దివ్యాంగ క్రీడాకారులు ఈ నెల 23వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9985568249, 9642094992 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఓటర్‌.. పారాహుషార్‌!

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు ఈ నెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. పోలింగ్‌కు ముందు ఓటర్లు కచ్చింతగా తెలుకోవాల్సి విషయాలు ఉన్నాయి.

ఓటుకు ఉంది ఓ చరిత్ర

చిత్తూరు కలెక్టరేట్‌: ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలో పేర్కొన్న విధానమే ఓటు. ఏ భాషలో అయినా అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటు అనే పిలుస్తారు. ఎన్నికల నేపథ్యంలో ఓటు, ఓటర్లు అనే పదాలు సాధారణంగా వినిపిస్తున్నాయి. కానీ, చాలా మందికి ఓటు అనే పదానికి అర్థం తెలియదు. ఓటు అనే పదం ఓటమ్‌ అనే లాటిన్‌ ఇంగ్లిష్‌ భాష నుంచి తీసుకున్నారు. ఓటు అనే పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. తెలుగు నిఘంటువు ప్రకారం సమ్మతి తెలపడం, మద్దతు ఇవ్వడం, అంగీకారం, వాగ్దానం, ఎన్నుకోవడమని అర్థాలను పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి పాలన అధికారం ఇవ్వడానికి తమ సమ్మతిని తెలపడమని అర్థం. ఓటు వినియోగం క్రీస్తు పూర్వం 139వ సంవత్సరం నుంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. పురాతన గ్రీస్‌ దేశంలో పగిలిన మట్టి పాత్రల ముక్కలను ఓట్లుగా వినియోగించినట్లు ప్రచారంలో ఉంది. ప్రాచీన భారతదేశంలో క్రీస్తు శకం 920లో తమిళనాడు రాష్ట్రంలో అరటి ఆకులను వినియోగించి ఓటు హక్కు ద్వారా ఎన్నికలు నిర్వహించారు. అభ్యర్థుల ఓట్లను లెక్కించడానికి ఓట్ల కోసం వినియోగించిన అరటి ఆకులను కుండలో ఉంచి ఎన్నికలు చేపట్టారు. ఈ పద్ధతిని కూడా కుడె వోలై వ్యవస్థ అని పిలిచారు. అమెరికాలో మొదటిసారిగా కాగితపు బ్యాలెట్లతో మసాచుసెట్స్‌ చర్చిలో పాస్టర్‌ని ఎంపిక చేసుకోవడం కోసం వినియోగంలోకి తీసుకువచ్చారు. ఆయా దేశాల రాజ్యాంగాలు పాలనా పరంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ప్రజలకు హక్కును కల్పిస్తూ ఓటు అనే ఆయుధం అందించాయి. 1950 నుంచి మన దేశంలో సార్వత్రిక వయోజన ఓటుహక్కు వినియోగంలోకి వచ్చింది. గతంలో బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేవారు తదనంతరం ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానం వచ్చింది. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్‌ విధానాన్నే అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement