టార్గెట్‌ చేసి తిరస్కరణ | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ చేసి తిరస్కరణ

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

● వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తొలగించారు ● స్క్రూటినీలో అవకతవకలకు పాల్పడ్డారు ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ

పలమనేరు : వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టార్గెట్‌ చేసి మరీ నామినేషన్లను తిరస్కరించారని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ మండిపడ్డారు. సోమవారం పలమనేరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల స్క్రూటినీలో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిబంధనలను అందరికీ ఒకే విధంగా ఉంటాయని, కూటమి అభ్యర్థులకు ఒకలా.. తమ పార్టీవారికి మరో లా ఉండవని స్పష్టం చేశారు. కూటమి నేతలకు ధైర్యముంటే ప్రజల ఓట్లతో గెలవాలి కానీ, అక్రమాలతో సాధించిన విజయం తాత్కాలికమే అని తెలిపారు. నామినేషన్‌ పత్రాల్లో టీడీపీ అభ్యర్థులు జిరాక్స్‌ కాపీలు పెడితే ఓకే చేసిన అధికారులు, తమ వాళ్లవి మాత్రం తిరస్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదని ఇదే సంస్క్రృతి భవిష్యత్‌లో పునరావృతం కాదనే గ్యారెంటీ లేదన్నారు. తమ అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటినీలో అన్యాయం జరిగిందని ఇక్కడికి వస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేతోనే ఇలా మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోందని మండిపడ్డారు. పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ నేతలు ఎంతమంది వచ్చినా లోపలికి పంపుతున్నారని, వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ లీగల్‌ టీమ్‌ హంగామా

నామినేషన్‌ సెంటర్‌ వద్ద టీడీపీ లీగల్‌ టీమ్‌ పేరిట కొందరు హంగామా చేశారని వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ హేమంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ జీపీగా ఉన్న న్యాయవాది సైతం టీడీపీకి తొత్తుగా పనిచేశారని ఆరోపించారు. తమ అభ్యర్థుల నామినేషన్లపై టీడీపీ లీగల్‌ టీమ్‌ అభ్యంతరం చెప్పడం దారుణమని మండిపడ్డారు. రిటర్నింగ్‌ అధికారుల విధులను సైతం వారే చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement