సర్టిఫికెట్‌ కోసం వెళితే బైండోవర్‌ | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్‌ కోసం వెళితే బైండోవర్‌

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

రేణిగుంట: ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం గాజులమండ్యం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లితే బైండోవర్‌ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన పోలీస్‌ క్లియరెన్స్‌ కోసం సోమవారం గాజులమండ్యం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు కొంత సమయం వేచి ఉండాలని పక్కన పెట్టి, మండల టీడీపీ అధ్యక్షుడు స్టేషన్లోకి వెళ్లిన తర్వాత కొంత సమయం చర్చించారు. ఆ తర్వాత ఆయన సూచనల మేరకు పోలీసులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రభాకర్‌ను బైండోవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఆయనను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లగా తహసీల్దార్‌ సోమ, మంగళవారాలు సెలవులున్నాయి.. బుధవారం తీసుకురావాలని ఫోన్లు సూచించడంతో మరళీ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి బుధవారం రావాలని ప్రభాకర్‌ను ఆదేశించారు. దీనిపై స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement