అడుగంటిన చెరువులు
జీవనాధారం దెబ్బతిని రోడ్డున పడిన జాలర్లు
పొట్టపోషణకు సైతం అవస్థలు
పడుతున్న 900 కుటుంబాలు
ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న మత్స్యకార సంఘాలు
మత్స్యకారులను ఎల్‌నినో చావుదెబ్బ కొట్టింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా జాలర్ల జీవితం అల్లకల్లోలంగా మారింది. ఎండల తాకిడి చెరువులు అడుగంటడంతో చేపల వేట ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పొట్టపోషణ సైతం కష్టతరంగా మారిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకుల ఉపాధికి అలమటించాల్సి దుస్థితి దాపురించింది. నీరు లేక చెరువుల్లో వదిలిన చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకార సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.తమ కుటుంబాలకు జీవనాధారం కల్పించి అండగా నిలవాలని విన్నవిస్తున్నారు.
కాణిపాకం : చేపల పెంపకం, అమ్మకాలనే నమ్ముకు ని జీవనం సాగిస్తున్న మత్స్యకారులపై ఎల్‌నినో ప్రభావతం తీవ్రంగా పడింది. వర్షాభావ పరిస్థితు లు, మండే ఎండల కారణగా చెరువులన్నీ మైదానాల ను తలపిస్తున్నాయి. కళ్లు కాయలు కాచేలా వర్షాల కోసం నిరీక్షిస్తున్న మత్స్యకారులకు నిరాశే మిగులు తోంది. చెరువులు అడుగంటిపోవడంతో చేపల పెంపకం దెబ్బతిని, వారి కుటుంబాలు పూట గడవక అల్లాడిపోతున్నాయి.
50 శాతం చెరువులు ఖాళీ
జిల్లాలోని 28 మండలాల పరిధిలో మొత్తం 197 చెరువులతో పాటు ప్రతిష్టాత్మకమైన అమ్మపల్లి రిజర్వాయర్ మత్స్యకారులకు ప్రధాన నీటి వనరుగా ఉంది. వీటి ఆధారంగానే వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. సాధారణంగా ఈ నీటి వనరుల్లో కట్ల, రోహు, మోసు, బంగారుతీగ, గడ్డి చేప, పాంప్లెట్, పంగాస్, కొర్రమీను, జిలేబి వంటి వివిధ రకాల చేపలను విస్తారంగా పెంచుతుంటారు. కానీ, ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే 50 శాతానికి పైగా చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. రాబోయే రోజుల్లోనూ వర్షాలు పడకపోతే చేపల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది.
పడిపోయిన దిగుబడి
సాధారణంగా సీజన్‌లో వారానికి సుమారు 10 నుంచి 12 టన్నుల చేపల ఉత్పత్తి జరిగేది. కానీ, ప్రస్తు తం చెరువుల్లో నీటి మట్టం ఘోరంగా పడిపోవడంతో వారానికి కేవలం 3 టన్నుల దిగుబడి మాత్రమే వస్తోంది.జిల్లాలోని కుప్పం, బైరెడ్డిపల్లె, రామకుప్పం, శాంతిపురం, పెద్దపంజాణి, పలమనేరు, గంగావరం, బంగారుపాళ్యం మండలాల పరిధిలోని చెరువుల్లో పరిస్థితి కొంతవరకు నయంగా ఉన్నప్పటికీ, మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది.
చేప పిల్లలు (ఫైల్)
చేపలు పడుతున్న మత్యకారులు (ఫైల్)
ఎల్‌నినో ప్రభావంతో కురవని వర్షాలు


