అజయ్‌రెడ్డికి అభినందన | - | Sakshi
Sakshi News home page

అజయ్‌రెడ్డికి అభినందన

Aug 30 2026 1:51 AM | Updated on Aug 30 2026 1:51 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : కర్నూలులో ఇటీవల నిర్వహించిన సీబీఎస్‌ఈ సౌత్‌జోన్‌ అండర్‌–19 ఆర్చరీ పోటీల్లో చాంపియన్‌ షిప్‌ కై వసం చేసుకున్న క్రీడాకారుడు అజయ్‌రెడ్డిని అదనపు ఎస్పీ రాజశేఖర్‌రాజు అభినందించారు జాతీ య స్థాయిలో పతకం సాధించాలని ఆకాంక్షించారు. శనివారం నగరంలోని బీవీరెడ్డి పాఠశాలలో చేపట్టిన క్రీడా దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇంటర్‌ ప్రథ మ సంవత్సరం చదువుతున్న అజయ్‌రెడ్డి ఇండియన్‌ రౌండ్‌ విభాగంలో 40 మీటర్లు, 30 మీటర్ల విభాగంలో 520 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ట్రోఫీ అందజేశారు. పాఠశాల నిర్వాహకులు సౌమినిరెడ్డి, అడ్మినిస్ట్రేటర్‌ బెంజిమి న్‌, ప్రిన్సిపల్‌ కౌసల్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement