కుప్పం రూరల్: ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఇకపై క్రమ తప్పకుండా త్రోబాల్ ఉమెన్ లీగ్ పోటీలు నిర్వహిస్తామని వీసీ అచార్య లక్కినేని చిన్న మల్లయ్య తెలిపారు. శనివారం ద్రవిడియన్ త్రోబాల్ ఉమెన్ లీగ్ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు రోజులుగా సాగుతున్న ఈ లీగ్‌లో 8 జట్లు పాల్గొన్నాయని, ఇందులో పీజీ ఆర్ట్స్ విద్యార్థినులు మొదటి బహుమతి, రెండో బహుమతి ఎంబీఏ , మూడో బహుమతి బీఎడ్ విద్యార్థినులు సాధించినట్లు వివరించారు. క్రీడలు ఆరోగ్య రక్షణకు ఉపయోగపడతాయని వెల్లడించారు. అనంతరం ఆయా జట్ల కెప్టెన్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్, అధ్యాపకులు యశోద, విజయవర్ధిని, నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్న క్రీడాకారులు
బహుమతుల ప్రదానోత్సవంలో వీసీ, అధ్యాపకులు


