బ్రేస్‌లెట్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

బ్రేస్‌లెట్‌ చోరీ

Aug 30 2026 1:51 AM | Updated on Aug 30 2026 1:51 AM

పలమనేరు : ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు. దీంతో ఆర్డినరీ, ఎక్స్‌పెరస్‌ సర్వీసులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కువమంది స్టాండింగ్‌లో వెళ్లాల్సివస్తోంది. శని వారం ఈ మేరకు కుప్పంలో బయలదేరిన ఓ ఆర్టీసీ బస్సులో చిత్తూరుకు చెందిన రూపేష్‌ స్టాండింగ్‌లో ప్రయాణం సాగిస్తుండగా చేతి బ్రేస్‌లెట్‌ను ఎవరో తస్కరించారు. పలమనేరులో కొందరు ప్రయాణికులు దిగడంతో సీట్లో కూర్చున్న తర్వాత బ్రేస్‌లెట్‌ అపహరణకు గురైనట్లు గుర్తించాడు. డ్రైవర్‌, కండక్టర్‌కు తన గోడును తెలిపి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ లోకేష్‌ రెడ్డి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

బంగారుపాళెం: చైన్నె– బెంగళూ రు జాతీయ రహదారిపై శనివారం కేజీ సత్రం వద్ద ఆర్‌టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు.. ఐరాల మండలం గోవిందరెడ్డిపల్లెకు చెందిన వీరభద్రారెడ్డి, ఆయన అల్లుడు మార్కొండరెడ్డి ద్విచక్ర వాహనంపై తవణంపల్లె మండ లం టి.పుత్తూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఉండగా కుప్పం నుంచి తిరుపతికి వెళుతున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రా రెడ్డి(70) తీవ్రంగా గాయపడగా, మార్కొండరెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వీరభద్రారెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. బంగారుపాళెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement