యాదమరి: జాతీయ మానవహక్కుల కమిషన్ కార్యదర్శి దేవేంద్రకుమార్ బుధవారం సంతగేటు పీహెచ్‌సీని తనిఖీ చేశారు.
ఉద్యాన రైతులకు ఎగుమతి అవకాశాలు
పూతలపట్టు(యాదమరి): రైతుల సౌకర్యార్థం పూత లపట్టు మండలం తలపులపల్లిలో రూ.25 కోట్లతో నిర్మించిన యూబీఆర్ ఫుడ్స్ ఎక్ప్‌పోర్ట్ బుధవారం ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవజాడ్లీ ప్రారంభించారు. సంస్థ చైర్మన్ తలపులపల్లి బాబురెడ్డి మాట్లాడుతూ ఈ యూనిట్ ద్వారా ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. సంస్థ మేనే జింగ్ డైరెక్టర్ ఉమాపతిరెడ్డి మాట్లాడుతూ మామిడి, బొప్పాయి, జామ, పైనాపిల్‌తో పాటు కొన్ని కూరగాయలను ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు. సౌత్‌జోన్ ఫుడ్ ప్రాసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబి, చిత్తూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రఘురాంచౌదరి, సంస్థ డైరెక్టర్లు తరుణ్‌రెడ్డి, రాధాపతినాయుడు, మోహన్‌రెడ్డి, కృష్ణమోహన్, హరీష్‌రెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు రాజారత్నంరెడ్డి, జయచంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వారకానథ్‌రెడ్డి పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్: చిత్తూరు టూటౌన్ సీఐగా పనిచేస్తున్న నెట్టికంటయ్యను వీఆర్‌కు బదిలీ చేస్తూ అనంతపురం డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వన్‌టౌన్ సీఐ చినపెద్దయ్య ఇన్‌చార్జ్ టూటౌన్ సీఐగా కొనసాగుతున్నారు.


