యువకుడి దుర్మరణం
బైరెడ్డిపల్లె : మండలంలోని లక్కనపల్లెలో బుధవారం ట్రాక్టర్ పాడుబడి బావిలోకి దూసుకెళ్లడంతో యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. లక్కనపల్లెకు చెందిన నాగరాజు కుమారుడు హరీష్(26) పొలం వద్ద ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ట్రాక్టర్‌ను స్టార్ట్ చేశాడు. ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి దూసుకెళ్లింది. దీంతో హరీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి తండ్రి నాగరాజు రెండేళ్ల క్రితమే మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా హరీష్ మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి లలితమ్మ, తమ్ముడు గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


