దత్తపుత్రుడు మాట వినలేదని.. | - | Sakshi
Sakshi News home page

దత్తపుత్రుడు మాట వినలేదని..

Jul 16 2026 5:06 AM | Updated on Jul 16 2026 5:06 AM

● పురుగుల మందు తాగి రిటైర్డ్‌ ఏవో ఆత్మహత్య

గుడిపాల: మండలంలోని కుప్పిగానిపల్లెలో బుధవారం రిటైర్డ్‌ అగ్రికల్చర్‌ అధికారి భాస్కర్‌(70) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు.. భాస్కర్‌కు సంతానం లేదు. 22 ఏళ్ల క్రితం కుప్పంలో పనిచేస్తున్న తరుణంలో చిరంజీవి అనే అతన్ని దత్తతు తీసుకుని పెంచుకున్నాడు. కొంతకాలంగా చిరంజీవి మద్యానికి బానిసయ్యాడు. సినిమా షూటింగ్‌కు వెళ్లాలనే పిచ్చి ఉండేది. భాస్కర్‌ను తరచూ డబ్బులు కావాలని వేధించేవాడు. కొన్ని నెలల క్రితం గుడిపాల పోలీసుస్టేషన్‌లో భాస్కర్‌పై ఫిర్యాదు కూడా చేశాడు. చిరంజీవిని పోలీసులు మందలించి తల్లిదండ్రుల మాట వినాలని చెప్పి పంపించారు. కొద్దిరోజులు బాగున్నా అతనిలో మార్పురాలేదు. మళ్లీ డబ్బు కోసం వేధిస్తుండడంతో కలత చెందిన బాస్కర్‌ బుధవారం బీరులో పురుగుల మందు కలుపుకుని తాగాడు. తీవ్ర అస్వస్థకు గురై మృతిచెందాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement