మావిగన్‌తోనే ఏపీ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మావిగన్‌తోనే ఏపీ అభివృద్ధి

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

● దళితుల ప్రాణాలతో ఆటలా? ● కూటమి కక్షసాధింపు వల్లే స్టీల్‌ప్లాంటు ఆగింది ● మాజీ డిప్యూటి సీఎం నారాయణస్వామి ధ్వజం

కూటమి కక్షసాధింపు వల్లే స్టీల్‌ప్లాంటు ఆగింది

రాష్ట్ర విభన తర్వాత తన ప్యాకేజీ కోసం కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ, స్టీల్‌ప్లాంటును తాకట్టు పెట్టింది చంద్రబాబేనని నారాయణస్వామి తూర్పారబట్టారు. 2018లో ఎన్నికల స్టంట్‌లో భాగంగానే కంబాలదిన్నె వద్ద స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి ఆయిన తర్వాత స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ చేశారని గుర్తుచేశారు. జెడ్పీటీసీ సభ్యుడులు అన్బ్‌లగన్‌, మండల కన్వీనర్‌ తులసీయాదవ్‌, మాజీ సర్పంచ్‌లు భాష్కర్‌రెడ్డి, గాలి మహేష్‌బాబు, అయ్య ప్ప, పుత్తూరు కేశవరెడ్డి, మాజీ మండల కన్వినర్‌ సుందరాజు, సుబ్రమణ్యరెడ్డి, పోలయ్య అరుల్‌, వేను, ఆనందన్‌, షణ్ముగరెడ్డి, పద్మనాభనాయుడు పాల్గొన్నారు.

పాలసముద్రం : ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, అభివృద్ధి మావిగన్‌తోనే సాధ్యమని మాజీ డెప్యూ టీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను సమన్వయం చేస్తూ మావిగన్‌ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ ప్రతిపాదన 2029 వైఎస్సార్‌ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీగా చేర్చనున్నట్లు ప్రకటించడం రాష్ట్ర ప్రజలకు కొత్త ఆశలు కలిగించే పరిణామమని తెలిపారు. కేవలం రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆంశం మాత్రమే కాకుండా ఏపీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే సమగ్ర విజన్‌కు ప్రతీకగా నిలుస్తుందన్నారు.

కీలకంగా తీసుకోండి ‘సర్‌’

ఓటర్ల పరిశీలనలో భాగంగా జరుగుతున్న సర్‌ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త కీల కంగా భావించాలని నారాయణస్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, దౌర్జన్యాలు అధి కమయ్యాయన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీపులను ఉసిగొల్పి దళితులను బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. దళితుల ఓట్లు అవసరం లేదని రఘరామకృష్ణంరాజు లాంటి వారు మాట్లాడుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సీఎం పవన్‌కల్యాణ్‌ ఇది తప్పు అని చెప్పకపోవడం దారుణమన్నారు. దళితులు మాట్లాడితే దాడులు చేస్తూ దౌర్జన్యాలకు దిగుతూ.. బహిష్కరణలు చేస్తున్నారన్నారు. కృష్ణలంకలో క్రాంతికుమార్‌ అనే దళితుడిని పోలీసులు తీవ్రంగా హింసించడంతో అతను సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తుచేశారు. దీనిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదన్నారు. కర్నూలు జిల్లాలో మాల గంగమ్మను లాకపడెత్‌ చేసినా ప్రభుత్వం పట్టింకోలేదన్నా రు. బద్వేలులో ఇద్దరు దళిత యువకులను దారుణంగా హత్య చేస్తే మందకృష్ణ మాదిగ లాంటి వారు నిరసనలు చేయాలని చెప్పారేగానీ ప్రభుతాన్ని నిదీయలేదన్నారు. సాక్షా త్తు హోంమంత్రి చంద్రబాబు మెప్పుకోసం రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి సహకరిస్తూ దళిత జాతికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement