అరచేతిలో పంచాయతీ లెక్కలు! | - | Sakshi
Sakshi News home page

అరచేతిలో పంచాయతీ లెక్కలు!

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

● గ్రామాల వారీగా ప్రజల ఫోన్లకు సమాచారం ● సన్నాహాలు చేస్తున్న అధికారులు

ప్రతి మూడు నెలలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు

చిత్తూరు కార్పొరేషన్‌: ఇకపై పంచాయతీ లెక్కల ప్రజలకు తెలిసే విధంగా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఏ పంచాయతీలో ఎంత నిధులు.. ఏయే పనులకు ఖర్చు చేశారోననే సమాచారం సంబంధిత పంచాయతీ ప్రజల సెల్‌ ఫోన్లకు మెసేజ్‌ ద్వారా వెళ్లేలా కసరత్తు చేస్తున్నారు.

పీడీఎఫ్‌ల ద్వారా ఫోన్లకు మెసేజ్‌లు

పల్లెలో ప్రభుత్వ పనులు చేయాలంటే సాధారణంగా గ్రామసభ తీర్మానం, ఏకగ్రీవం, పనులకు అంచనా వేయడం, ఆ పనులను ప్రారంభించి, ముగించడం లాంటివి జరగాలి. వీటికి ఎంత తక్కువ కాదన్నా మూడు నెలలు అవసరం. అలా ప్రతి మూడు నెలలకు పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు.. వాటికి పెట్టిన ఖర్చులు సంబంధిత ప్రజల ఫోన్‌కు పీడీఎఫ్‌ ద్వారా పంపనున్నారు. ఎలాగో పన్నుల చెల్లింపు సమయంలో గ్రామీణుల ఫోన్‌ నంబర్లు పంచాయతీ సిబ్బంది సేకరించారు. వాటికి ప్రతి మూడు నెలలకొసారి సంవత్సరానికి నాలుగు మార్లు సమా చారం పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సన్నాహాలు చేస్తున్న అధికారులు

ప్రస్తుతం పంచాయతీలో జరిగే ప్రతిపని లెక్కలను స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఇటీవల వీటి నమోదులో తప్పులు చేసిన 11 మంది కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు అందజేశారు. ఇక ప్రతి మూడు నెలలకొసారి పల్లెలో ఖర్చుల వివరాలను ఇంటి పన్నులు చెల్లిస్తున్న యజమానులు ఫోన్లకు సమాచారం ఇవ్వనున్నారు.

జిల్లా సమాచారం

సిద్ధమవుతున్నాం

పన్నులు చెల్లిస్తున్న వారి ఫోన్‌ నంబర్లకు పంచాయతీల ఖర్చుల వివరాలను పీడీఎఫ్‌ రూపంలో పంపనున్నాం. ఈ మేరకు ఆ పనులకు సిద్ధమవుతున్నాం. స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్‌లో గ్రామంలో జరిగే ఖర్చుల వివరాలను నమోదు చేస్తున్నాం. ఇక గ్రామీణులకు వారి ప్రాంతంలో పెట్టిన వ్యయం వివరాలను ప్రతి మూడు నెలలకోసారి వారికి సమాచారం అందించనున్నాం.

– సుధాకర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి

పంచాయతీలు 622

మొత్తం అసెస్‌మెంట్లు 2,79,287

గత ఏడాది పన్ను వసూళ్లు

రూ.26.27 కోట్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement