పాఠశాల విద్యార్థులు తమ శరీర బరువులో 10 శాతానికి మించి బరువు మోయడం అత్యంత ప్రమాదకరం. లేత వయసులో ఎముకలు, వెన్నెముక పూర్తిగా ఎదుగుదల దశలో ఉంటాయి. అలాంటి సమయంలో రోజుకు 10 కిలోల చొప్పున బరువును వీపున మోస్తూ, బస్సులు ఎక్కడం, మెట్లు ఎక్కడం వల్ల వెన్నుపూసపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. చిన్న వయసులోనే నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. నిరంతరం బరువు వెనక్కి వంగిపోయే స్కోలియో సిస్, ముందుకు వంగిపోయే కై ఫోసిస్ వంటి శాశ్వత వైకల్యాలు వచ్చే ప్రమాదం ఉంది. 30–40 ఏళ్ల వయసులో వచ్చే స్పాండిలైటిస్ సమస్యలు ప్రస్తుతం 14 ఏళ్లకే చూస్తున్నాం. స్కూల్ బ్యాగుల బరువును తక్షణమే తగ్గించకపోతే భావితరం శారీరకంగా బలహీన పడుతుంది.
– డా.వికాస్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్, చిత్తూరు


