వైఎస్సార్సీపీలోకి 200 మంది చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీలోకి 200 మంది చేరిక

Jul 6 2026 12:22 AM | Updated on Jul 6 2026 12:22 AM

● కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మిథున్‌రెడ్డి

పూతలపట్టు(యాదమరి): చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఏకంగా ఒక పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఓ నేత వైఎస్‌ జగన్‌ భావజాలానికి ఆకర్షితులై తన అనుచర గణంతో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఐరాల మండలం, అగ్రహారంపల్లి గ్రామానికి చెందిన యువ నాయకులు, పూతలపట్టు నియోజకవర్గం బీసీవై(భారత చైతన్య యువజన పార్టీ) తరఫున 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైఎస్సార్సీ పీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌పై అభిమానంతో, ఆయ న ప్రవేశపెట్టిన పలు విప్లవాత్మక సంక్షేమ పథథకాల పట్ల ఆకర్షితులై ఆదివారం మాజీ ఎమ్మెల్యే డా.సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయ న వెంట నియోజకవర్గంలో దాదాపు 200 మంది బీసీవై, టీడీపీకి చెందిన యువత వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ముందుకు రావడం శుభపరిణామని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. భానుప్రసాద్‌తో పాటు 200 మంది యువత పార్టీలో చేరడానికి క్రియాశీలకంగా పనిచేసిన సీనియర్‌ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి, పూతలపట్టు మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డిని ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి అభినందించారు. నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవం కోసం అహర్నిశలు కష్టపడుతామని, జగనన్నను తిరిగి సీఎంగా చేసేంతవరకు విశ్రమించబోమని భానుప్రసాద్‌ చెప్పారు. తలపులపల్లి బాబురెడ్డి, మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ కార్యదర్శి అమర్నాథ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ద్వారకానాథరెడ్డి, సీనియర్‌ నాయకులు రాజారత్నంరెడ్డి, జయ చంద్రారెడ్డి, లీగల్‌ సెల్‌ కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి, పృధ్విరెడ్డి, ఐరాల మండల బూత్‌ కమిటీ అధ్యక్షుడు హరీష్‌రెడ్డి, బ్రహ్మతేజ, ఢిల్లీ ప్రసాద్‌, లక్ష్మీనారాయణ, సూర్య, సాయి, లారెన్స్‌, నాని పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement