ఇన్నాళ్లు పడ్డ బాధులు ఒక ఎతైతే..పంటను అమ్ముకోవడం మరో ఎత్తు. ఎన్ని కష్టాలు ఉన్నా ఈ కాయలను అమ్ముకోవాలి కదా. ఈ ప్రాంతం అడవి. ఏం చేద్దాం. రాత్రంతా కంటిపై రెప్ప వేయకుండా బండిని చూసుకుంటున్నాం. పగలు కునుకు తీస్తాం. ఇక్కడేమో కాయలు అన్‌లోడ్ చేసేందుకు ఆరో రోజులు పట్టేట్టు ఉంది.
– శ్రీరాములురెడ్డి, శేషచలం పురం, చిత్తూరు నగరం
ఆ ఫ్యాక్టరీలను మూసేశారు
నేను వచ్చి ఇప్పటికి ఐదు రోజులు అయింది. ఇంత వరకు కాయ దిగలేదు. చిత్తూరు గంగసాగరంలోని ఓ ఫ్యాక్టరీని, గుడిపాల కొత్తపల్లిలోని ఇంకో ఫ్యాక్టరీని పూర్తిగా మూసేశారు. అక్కడ తోతాపురి కొనడం లేదు. అందుకని ఇక్కడకు వచ్చాం. ఇక్కొడొస్తే.. కాయలు ఇంత వరకు దించుకోలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
– ప్రకాష్, చెన్నసముద్రం, చిత్తూరు మండలం
అడ్డదారిలో తీసుకెళ్లి పోతున్నారు
సిఫార్సులతో వచ్చే ట్రాక్టర్లను ఇంకో ఫ్యాక్టరీలో తూకమేసి..అడ్డదారిలో ఫ్యాక్టరీలో దింపేస్తున్నారు. ఒక్క రోజే 100 ట్రాక్టర్లు అలా సిఫార్సులతో వచ్చేస్తున్నాయి. అందుకే సామాన్య రైతు కాయలు క్యూలో కుళ్లిపోతున్నాయి. అడిగితే దురుసు గా మాట్లాడుతున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
– రవి, ఐరాల మండలం


