అక్షర ఆంధ్ర పరీక్ష విజయవంతం | - | Sakshi
Sakshi News home page

అక్షర ఆంధ్ర పరీక్ష విజయవంతం

Mar 16 2026 7:46 AM | Updated on Mar 16 2026 7:46 AM

పెనుమూరు(కార్వేటినగరం): జిల్లాలో అక్షర ఆంధ్ర ఫైనల్‌ పరీక్ష విజయవంతం అయిందని, 99 శాతం మంది అభ్యాసకులు హాజరయ్యారని వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు ఎస్‌.మహ్మద్‌ అజాద్‌ అన్నా రు. ఆదివారం పెనుమూరు మండలం కలవకుంట మండల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అక్షర ఆంధ్ర పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వయోజన విద్యాశాఖ డీడీ మాట్లాడుతూ.. అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా చదువు నేర్చుకున్న అభ్యాసకులకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో పరీక్ష నిర్వహించడం జరిగిందని అభ్యాసకులు వారికి అనుకూలమైన సమ యంలో వచ్చి రెండు గంటల పాటు పరీక్ష రాయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా లక్ష్యం 65,185 అభ్యాసకులను నిర్ణయించారని , పరీక్ష నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1583 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు 1583 మంది అంగన్వాడీ టీచర్లను అలాగే స్థానికంగా ఉన్న ఇతరులను ఇన్విజిలేటర్లుగా నియమించామని పేర్కొన్నారు. అభ్యాసకులు వారికి అనుకూలమైన సమయంలో రెండు గంటలు పరీక్ష రాయడం జరిగిందని తెలిపారు. ప్రతి విభాగంలో పాస్‌ మార్కులు 17గా నిర్ణయించామని, ఏదైనా విభాగంలో 17 మార్కుల కన్నా తక్కువగా వచ్చినట్లయితే 5 గ్రేస్‌ మార్కుల ను కలపవచ్చని, అంగన్వాడీ టీచర్లు, అలాగే ఇతర ఇన్విజిలేటర్లు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసిన తరువాత మార్కులను అవార్డు లిస్టులో వేసి అవార్డు లిస్టును వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్లకు ఇవ్వాల్సి ఉంటుందని, మార్కుల ను అలాగే హాజరును అక్షర ఆంధ్ర యాప్‌ లో అప్లోడ్‌ చేయాలన్నారు. ఆదివారం జరిగిన అక్షర ఆంధ్ర పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 64,560 మంది అభ్యాసకులు హాజరు కావడంతో 99 శాతం హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను ఉప సంచాలకులతో పాటు పర్యవేక్షకులు జయప్రకాష్‌రెడ్డి, డీఆర్‌డీఏ ఏపీఎం చిరంజీవి, పలువు రు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement