రెండు కార్లు ఎదురెదురుగా ఢీ | - | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఎదురెదురుగా ఢీ

Mar 16 2026 7:46 AM | Updated on Mar 16 2026 7:46 AM

● గూగుల్‌ మ్యాప్‌లో చూస్తూ మార్గం తప్పిపోయిన వైనం ● ఈక్రమంలో పుత్తూరు మీదుగా చైన్నె వెళ్తుండగా ఘటన ● ఒకరికి తీవ్రగాయాలు , అయిదుగురికి స్వల్పగాయాలు

● గూగుల్‌ మ్యాప్‌లో చూస్తూ మార్గం తప్పిపోయిన వైనం ● ఈక్రమంలో పుత్తూరు మీదుగా చైన్నె వెళ్తుండగా ఘటన ● ఒకరికి తీవ్రగాయాలు , అయిదుగురికి స్వల్పగాయాలు

గంగాధర నెల్లూరు: రెండు కార్లు ఎదురెదురుగా అప్పిరెడ్డి కండ్రిగ వద్ద ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో అయిదుగురికి చిన్నపాటి గాయాలైన సంఘటన మండలంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది . స్థానిక పోలీసుల కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలంలోని ఎట్టేరి పంచాయతీ అప్పిరెడ్డి కండ్రిగ వద్ద ఆదివారం సాయంత్రం చిత్తూరు– పుత్తూరు జాతీయ రహదారిపై బెంగళూరు నుంచి చైన్నెకి గూగుల్‌ మ్యాప్‌లో మార్గం తప్పిపోయి జీడీ నెల్లూరు–పుత్తూరు మీదుగా ప్రయాణిస్తున్న కారు , వెదురు కుప్పం మండలంబొమ్మయపల్లి గ్రామం నుంచి చిత్తూరు వైపునకు ప్రయాణిస్తున్న మరో కారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బెంగళూరు నుంచి చైన్నెకి వెళుతున్న తిరుమలేష్‌ కుటుంబ సభ్యులు కలై వాణికి తీవ్ర గాయాలు కాగా , మరో కారులో ఉన్న బొమ్మాయిపల్లికి చెందిన మధుతో పాటు ఇద్దరు కుమారులకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన కలై వాణిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మధు కుమారులు ఇద్దరిని వేలూరు సీఎంసికి తరలించినట్లు తెలిపారు . అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement