సంపూర్ణ మద్ధతుకు ఏకగ్రీవ తీర్మానం | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణ మద్ధతుకు ఏకగ్రీవ తీర్మానం

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

సంపూర

సంపూర్ణ మద్ధతుకు ఏకగ్రీవ తీర్మానం

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా ఎన్‌జీఓ సంఘం తరఫున రాష్ట్ర ఎన్నికలకు సంపూర్ణ మద్ధతు తెలిపేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్‌జీఓ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన జరగబోయే ఎన్‌జీఓ సంఘం ఎన్నికలకు ప్రణాళికబద్దతను కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 తాలూకా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యుల సలహా మేరకు విద్యాసాగర్‌, డీవీ రమణ ప్యానెల్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకు జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. అన్ని తాలూకాల్లో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర నాయకత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా కార్యదర్శి రమేష్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ప్రదీప్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డి, జిల్లా ట్రెజరర్‌ మురళి పాల్గొన్నారు.

ఊరి బడిని కాపాడుకుందాం

చిత్తూరు కలెక్టరేట్‌: ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించి, ఊరి బడిని కాపాడుకుందామ ని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ బడుల అడ్మిషన్ల పెంపునకు ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు యూటీఎఫ్‌ అవగాహన కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వ బడుల గొప్పదనాన్ని పోస్టర్లు ముద్రించామన్నారు. క్షేత్రస్థాయిలో పోస్టర్ల రూపంలో విస్తృతంగా అవగాహన పెంచేందుకు చర్య లు చేపట్టామన్నారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మణి గండన్‌, సభ్యులు రెహానబేగం, సదాశివరెడ్డి, ఏకాంబరం, ఎస్పీ బాషా పాల్గొన్నారు.

సంపూర్ణ మద్ధతుకు ఏకగ్రీవ తీర్మానం 
1
1/1

సంపూర్ణ మద్ధతుకు ఏకగ్రీవ తీర్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement