కోడెగిత్తల జోరు
వెదురుకుప్పం: మండలంలోని ఎగువ గెరిగదొనలో అట్టహాసంగా సాగిన జల్లికట్టు యువకుల్లో జోష్ తెచ్చింది. రంకెలేస్తూ దూసుకుపోయిన కోడెగిత్తలు... ఈలలు అరుపులు కేకలతో పలకల కోసం యువత చేసిన సాహసించినా పోట్లగిత్తల పరుషాని కి బెంబేలెత్తిపోయారు. హోరుగా హుషారు గా సాగిన ఎడ్ల పందాలు దుమ్ము రేపాయి.
దమ్ముంటే కాసుకో...
దమ్ముంటే కాసుకో అన్నట్లు సాగిన ఎడ్ల పందెంలో కోడిగిత్తలదే పైచేయి అయ్యింది. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పశువులను పందానికి తీసుకొచ్చారు. నిర్వాహకులు ఎడ్లకు పలకలు, వస్త్రాలు కట్టి పందానికి సిద్ధం చేశారు. అప్పటికే అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్న యువత పందానికి సై అన్నట్టు అల్లి వద్ద నిలబడ్డారు. పందానికి సిద్ధంగా ఉన్న ఎడ్లను ఉసిగొల్పారు. కోడెగిత్తలు రంకెలేసుకుంటూ జన ప్రవాహాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయాయి. ఎద్దులను నిలువరించి పలకలు పట్టేందుకు యువత విశ్వ ప్రయత్నం చేశారు. కొన్ని ఎడ్ల వేగాన్ని నిలువరించి పలకలు పట్టి తమ ప్రతాపాన్ని చూపారు. అయితే పోట్లగిత్తలు జన ప్రవాహాన్ని సైతం లెక్క చేయకుండా జనాన్ని చీల్చుకుంటూ పరుగులు తీశాయి. కట్టడి చేసే క్రమంలో యువతను చిత్తు చిత్తు చేశాయి.
కోడెగిత్తల జోరు


