భక్తిశ్రద్ధలతో తైపూసం పూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో తైపూసం పూజలు

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

భక్తిశ్రద్ధలతో తైపూసం పూజలు

భక్తిశ్రద్ధలతో తైపూసం పూజలు

కార్వేటినగరం: స్కంధ పుష్కరిణి సమీపంలో కుమారగిరిపై వెలసిఉన్న శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో తైపూ సం పాలకూడం పూజలు నిర్వహించారు. ఆలయ ఆధ్యక్షుడు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో స్థానిక ద్రౌపదీదేవీ అమ్మవారి ఆలయం వద్ధ నుంచి భక్తులు పాల కలశాలను శిరస్సున పెట్టుకుని ఊరే గింపుగా కుమారగిరిపై వెలసి ఉన్న సుమ్రణ్యస్వామి ఆలయానికి చేరుకున్నారు. వేద మంత్రాల నడు మ అత్యంత వైభవంగా పూ జా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ ధనుంజయవర్మ ఆలయ ఆవరణలో అన్నదానం చేపట్టారు. సాయంత్రం వళ్లీ, దేవసేన సమే త శ్రీసుబ్రమణ్య స్వామివారిని పట్టువస్త్ర సుగంధ భరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై ప్రతిష్టించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈఓ క్రిష్ణనాయక్‌, మాజీ ఆలయ అధ్యక్షుడు రవియాదవ్‌, సాయి, సోము పాల్గొన్నారు.

అంతరాలయ దర్శనం ప్రారంభిస్తున్న ఈఓ

త్వరితగతిన రైతు నమోదు ప్రక్రియ

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): కేంద్రం ఆదేశాల మేరకు చేపడుతున్న రైతుల నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీ తెలిపారు. జిల్లా లో 2,55,609 మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 1,93,042 మంది రైతుల నమోదు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఇంకా 62,567 చేయాల్సి ఉందన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌పై దృష్టి పెట్టండి

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ, పరిసరాల శుభ్రతతోనే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకు సాధ్యమని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ లోకేష్‌ అన్నారు. ఆదివారం కార్పొరేషన్‌ కార్యాలయంలో సచివాలయ పర్యావరణ–పారిశుధ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించాలన్నారు. నగరాన్ని సుందరంగా ఉంచడంలో కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లోకనాథం పాల్గొన్నారు.

నాకు కొరివి పెడతావనుకొంటే నువ్వే ముందు వెళ్లిపోయావా అంటూ తండ్రి ఓపక్క.. మరోపక్క నన్ను ఒంటరి చేసిపోతివే.. నాకు నాబిడ్డకు దిక్కెవరంటూ భార్య ఆక్రందనలతో పుత్తూరు ఆసుపత్రి మార్మోగిపోయింది. చూపరులకు కంట తడి పెట్టించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో వారి స్వగ్రామం ఎరికంబట్టులో విషాదఛాయలు అలముకొన్నాయి. ఈ విషాద ఘటనకు వ్యాన్‌ డ్రైవర్‌ అతివేగం కారణం కావడం బాధాకరం.

పుత్తూరు: ఓ పక్క రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్న వేళ.. అతివేగం వద్దూ, హెల్మెట్‌ వినియోగించండి.. అంటూ అధికారులు ఓ పక్క అవగాహన కల్పిస్తున్నా.. తీరుమారని వ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో స్థానిక బైపాస్‌ రోడ్డులోని గోవిందపాళెం సర్కిల్‌ వద్ద తిరుపతి నుంచి నగరి వైపు వెళ్తున్న బొలెరో వ్యాను అతివేగంగా రెండు మోటర్‌ సైకిళ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మోటార్‌ సైకిల్‌పై రోడ్డు దాటుతున్న కీళగరం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(38) తీవ్రంగా గాయపడ్డాడు. మరో మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న తాతా మనవళ్లలో కె.కాళప్ప(70) అక్కడికక్కడే మృతి చెందగా, కె.విజయ్‌కుమార్‌(32) తీవ్రంగా గాయపడ్డాడు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం 108లో తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతులు నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన వారు. ఇద్దరూ మేస్త్రి పనులు ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డారు. మృతుడు విజయ్‌కుమార్‌కు భార్య, రెండేళ్ల కుమార్తె ఉంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడడంతో ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విలపిస్తున్న మృతుడు విజయ్‌కుమార్‌ భార్య

మృతుడు కాళప్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement