నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే | - | Sakshi
Sakshi News home page

నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్ముడ్‌ రిజర్వు (ఏఆర్‌) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మ ద్‌ తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 79931 47979 నంబర్‌కు ఫోన్‌ చేయాలని వివరించారు.

అంతరాలయ దర్శనం ప్రారంభం

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నూతనంగా అంతరాలయ దర్శనం ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు సామాన్య భక్తులకు కూడా స్వామివారిని అత్యంత సమీపంగా దర్శించుకునే అవకాశం కల్పించారు. అంతరాలయ దర్శనం ప్రారంభమైన మొదటి రోజున సుమారు 438 మంది భక్తులు టికెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ దర్శనానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ దర్శనానికి సంబంధించిన మొదటి టికెట్‌ను దేవస్థానం ఈఓ పెంచల కిషోర్‌ కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి టికెట్‌పై రూ.75 విలువైన అభిషేకం లడ్డూ భక్తులకు అందజేయనున్నట్లు ఈఓ పెంచలకిషోర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement