కాణిపాకంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

కాణిపాకంలో భక్తుల రద్దీ

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

కాణిప

కాణిపాకంలో భక్తుల రద్దీ

కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దర్శనార్థం క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. తాగునీరు, షెడ్లు, క్యూలైన్‌ నిర్వహణతోపాటు భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేశారు. అదనపు సిబ్బందిని కూడా నియమించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

భాషా పండితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

చిత్తూరు కలెక్టరేట్‌: భాషా పండితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్‌ఎల్‌టీఏ (రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ) నూతన జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఆదివారం ఆ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. నూతన జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. డీఈఓ పూల్‌లో పదోన్నతి పొందిన పండిట్లకు నోషనల్‌ సీనియారిటీ కల్పించాలన్నారు. జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా గాంధీబాబు, జిల్లా గౌరవ అధ్యక్షులుగా శ్రీనివాసులు, గౌరవ సలహాదారుగా శ్రీధర్‌, సంయుక్త కార్యదర్శిగా వైదేహి, కృష్ణమూర్తి, అదనపు కార్యదర్శిగా సత్యం, ఆర్థిక కార్యదర్శిగా అంజప్పలను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు దొడ్డా ఉమామహేశ్వరరావు దుశ్శాలువాలతో సత్కరించారు.

కేసు నమోదు చేయాలి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): బాలికను కిడ్నాప్‌ చేసి, లైంగికదాడికి పాల్పడిన నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని వెదురుకుప్పం మండలం సద్దికూళ్లపల్లి అరుంధతీవాడకు చెందిన బాలిక తల్లి మంజుల ఆరోపించారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కుమార్తెను గతేడాది డిసెంబర్‌ 9న తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన చందు అనే యువకుడు కిడ్నాప్‌ చేశాడని తెలిపారు. చందు అనే వ్యక్తి తన గ్రామంలో ఉన్న వారి బంధువుల ఇంటికి వస్తూ ఉండేవాడని, ఈ క్రమంలో తమ కుమార్తెకు మాయ మాటలు చెప్పి అపహరించి తీసుకెళ్లారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. దీంతో తాము హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్పందించి తమ బాలిక ఆచూకీని కనిపెట్టి అప్పగించారని చెప్పారు. ప్రస్తుతం తమ కుమార్తె తిరుపతిలోని ఓ హోమ్‌లో ఉందని తెలిపారు. అయితే తన కుమార్తెను కిడ్నాప్‌ చేసిన నిందితునిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

కాణిపాకంలో భక్తుల రద్దీ 
1
1/1

కాణిపాకంలో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement