
కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం
కార్యక్రమానికి హాజరైన నాయకులు, సదుం: మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సదుం: కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ గ్రామ కమీటీల ఏర్పాటులో రాష్ట్రానికి పుంగనూరు నియోజకవర్గం ఆదర్శం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎర్రాతివారిపల్లెలో నియోజకవర్గ నాయకులతో గురువారం జరిగిన సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా పుంగనూరును ఎంపిక చేసి, గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలు ఇక కీలకం కానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వారికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. కమిటీ సభ్యులు చురుగ్గా ఉంటూ.. పార్టీ కార్యక్రమాలను సోషయల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని ఆయన పులుపునిచ్చారు. గ్రామాలలో నాయకుల మధ్య ఉండే స్పర్థలు వీడాలని, అందరికీ తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఎవరికి ఇబ్బంది కలిగించినా..!
వెంట నడుస్తున్న ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తకూ తమ కుటుంబం అండగా ఉంటుందని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఎవరికి ఇబ్బంది కలిగించినా తాను వదిలేది లేదని స్పష్టం చేశారు. పుంగనూరుకు ఉన్న ప్రత్యేక పేరును నిలిపేలా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.
ఎవరూ భయపడాల్సిన పనిలేదు
రొంపిచెర్ల: కార్యకర్తలకు తాను అండగా ఉంటానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రొంపిచెర్ల మండలం, పెద్దగొట్టిగల్లు గ్రామ పంచాయతీ, మేకలవారిపల్లెలో ఆయన పర్యటించారు. కార్యకర్తలెవ్వరూ భపడాల్సిన పనిలేదన్నారు. వారికి ఏకష్టం వచ్చినా తాను అండ గా ఉంటానని స్పష్టం చేశారు. పెద్దగొట్టిగల్లు, బండకిందపల్లె సరిహద్దులో నిర్మించిన బడబళ్ల వంక ప్రాజెక్టు ముంపు భూములకు పరిహారం మంజూరు చేయించాలని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకుడు యర్రంరెడ్డి గృహ ప్రవేశానికి హాజరయ్యారు. అలాగే తల్లి మృతి చెందిన మదనమోహన్‌రెడ్డి కు టుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌రెడ్డి, చెంచురెడ్డి, స ద్దారామిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, యుగంధర్‌రెడ్డి, కోట వెంకటరమణ, శ్రీనాథనాయుడు, విజయశేఖర్, కరీముల్లా, మహబుబ్‌బాషా, అల్లాభక్స్, బావాజాన్, హరికృష్ణారెడ్డి, విజయకుమార్‌రెడ్డి, రామనారాయణరెడ్డి, కరుణాకర్, వెంకటరమణారెడ్డి, చిన్న రెడ్డెప్పరెడ్డి, శ్రీనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఊహించని స్పందన
గ్రామ కమిటీలకు తమ అంచనాలకు మించి స్పందన వస్తున్నట్లు పార్టీ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి తెలిపారు. వివిధ కమిటీలలో స్థానం కోసం స్వచ్ఛందంగా పలువురు ముందుకొస్తున్నారన్నారు. 6, 7, 8 తేదీలలో మండల స్థాయిలో కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 28న రచ్చబండ పేరుతో 142 పంచాయతీలు, 31 వార్డులలో ఏకకాలంలో జూమ్ సమావేశాలు జరుగుతాయన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, సదుం, సోమల, పులిచర్ల, రొంపిచర్ల మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ కన్వీనర్లు, వివిధ విభాగాల శ్రేణులు హాజరయ్యారు.

కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం