
కష్టాల్లో రైతులు
– చంద్రబాబు, పవన్‌కు మాజీ మంత్రి ఆర్కేరోజా సూటి ప్రశ్న
నగరి : ప్రస్తుత పాలనలో రాష్ట్ర వ్యాప్తకంగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. రైతులు పడుతున్న కష్టాలపై గురువారం నగరిలోని తన నివాసం వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎరువులకు, యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు చెప్పనలవికావన్నారు. సరిచెయ్యాల్సిన ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి వారి చేతకాని తనాన్ని వాస్తవాలు బయటపెట్టే ‘సాక్షి’పై చూపిస్తున్నారన్నారు. క్యాబినేట్ మీటింగ్ పెట్టుకొని ఫేక్‌ల పనిపడతాం అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. ‘సాక్షి’లో కథనం వచ్చిన రోజునే పచ్చ పత్రికల్లో యూరియా ఏదయ్యా, యూరియా వెతలు అంటూ కథనాలు వచ్చాయని ఇది అవాస్తవమైతే ఆ పత్రికలపై ఎందుకు కేసులు పెట్టడం లేదన్నారు. కుప్పం, పిఠాపురం నియోజకవర్గంల్లోనూ రైతులు ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారని, దీనికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సిగ్గుపడాలన్నారు. రైతులకు రూ.25 వేలు ఇస్తానని చెప్పిన మీరు 15 నెలల పాలనలో ఇచ్చింది రూ.5 వేలే అన్నారు. ఇది రైతులను మోసం చేయడం కాదా అన్నారు.