
వెలుగులు నింపేది టీచర్లే
వి.కోట: మంచి సమాజాన్ని నిర్మించాలని అహర్నిశలు శ్రమిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తాను కరిగిపోతూ వెలుగునిచ్చేది ఉపాధ్యాయులేనని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కొనియాడారు. గురువారం పట్టణంలోని మెయిన్ స్కూల్ (ప్రాథమిక పాఠశాల)లో ఎంఈఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్మన్ హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపలి్‌ల్ రాధాకృష్ణ అడుగుజాడల్లో నడిచి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును కల్పించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఎంఈఓలు చంద్రశేఖర్, మురుగేష్, ఎంపీడీఓ ఈశ్వరన్ పాల్గొన్నారు.