
ఆర్‌ఎస్‌కేల్లో యూరియా పంపిణీ
పలమనేరు: జిల్లాలోని రైతు సేవాకేంద్రాల ద్వారా యూరియాను పంపిణీ చేయనున్నట్టు డీఏఓ మురళీకృష్ణ తెలిపారు. ఆ మేరకు నియోజకవర్గంలోని పలు ఆర్‌ఎస్‌కేలో సాగుతున్న డీబీటీ(డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్‌ఫర్) విధానాన్ని పరిశీలించారు. ఆపై పలమనేరులోని మనగ్రామోర్ దుకాణంలో రికార్డులను పరిశీలించారు. ఆర్‌ఎస్‌కేలో బయోమెట్రిక్ చేసుకున్న రైతులకు పండుగ తర్వాత యూరియా ను అందిస్తామన్నారు. ఒక్కో ఆర్‌ఎస్‌కేకు సగటున 150 బ్యాగులను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆయ న వెంట పుంగనూరు ఏడీ శివకుమార్ ఉన్నారు.