
వరసిద్ధునికి విరాళం
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన ట్రస్టుకు మంగళవారం బెంగుళూరుకు చెందిన బాబు రూ.లక్ష, అలాగే కై కలూరుకు చెందిన మాధవి గోసంరక్షణ ట్రస్టుకు రూ. 3లక్షలు విరాళం అందజేశారు. వీరికి ఆలయ అధికారులు స్వామి దర్శనం కల్పించారు.
మండపాలకు ఉచిత విద్యుత్
చిత్తూరు కార్పొరేషన్: వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. జిల్లాలోని వీధుల్లో ప్రతిష్టించే ప్రతిమల మండపాలకు తాత్కాలిక విద్యుత్ అనుమతికి ఎవరూ పైకం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అదే విధంగా దసరా పండుగకు ఏర్పాటు చేసే అమ్మవారి మండపాలకు సైతం ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వివరించారు.

వరసిద్ధునికి విరాళం