
సైనికుల్లా పనిచేయండి
కార్వేటినగరం: క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు యువత నడుం బిగించి సైనికుల్లా పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తాడెపల్లిలోని ఆయన నివాసంలో మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి, కార్వేటినగరం మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌తో పాటు పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి యువత ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. అంధికారం బలంతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న రాక్షస పాలనకు స్వస్థిపలకాలని చెప్పారు. వారివెంట జిల్లా సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి కార్తీక్‌రెడ్డి, సోషల్ మీడియా మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, ఐటీ విభాగం మండల ప్రధాన కార్యదర్శి చరణ్ ఉన్నారు.