
డ్రైవర్లకు స్వల్ప గాయాలు
బంగారుపాళెం: మండలంలోని మొగిలి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనిఫుడ్ ఫ్యాక్టర్ సమీపంలో గల మొగిలి కూడలి వద్ద టాటా ఏస్ వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం దెబ్బతింది. హైవే మొబైల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి వ్యక్తి మృతి
గంగవరం: ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి బావిలో పడిన ఘటన శుక్రువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పలమనేరు పట్టణం, పట్రమునస్వామి వీధికి చెందిన శ్రీనివాస్(49) గంగవరం మండలం, ఎద్దుల చెరువుకట్ట ఆనుకుని ఉన్న పొలాల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ అక్కడే ఉండేవాడు. అయితే పొలానికి ఆనుకుని పాడుబడ్డ బావిలో ప్రమాదవశాత్తు పడి మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.