విలపింఛన్
● ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుని పేరు షామీర్‌బాషా. ఈయన జిల్లాలోని బంగారుపాళ్యం మండలంలో నివసిస్తుంటారు. 2014 నుంచి పింఛన్ పొందుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో షామీర్‌బాషా పింఛన్‌ను తొలగించారు. ఆ మేరకు ఎంపీడీవో నోటీసు పంపారు. కలెక్టరేట్‌కు విచ్చేసి ఇటీవల వినతిపత్రం అందజేశారు. పరిశీలనకు విచ్చేసిన డాక్టర్లు కనీసం ఎలాంటి పరీక్షలు చేయలేదని బాధితుడు వాపోయారు. కూటమి ప్రభుత్వానికి తమపై ఎందుకింత కక్ష అంటూ షామీర్ బాషా ఆవేదనకు లోనయ్యారు. – చిత్తూరు కలెక్టరేట్ ● నాకు 85 శాతం అంగవైకల్యం ఉంది. ఈ విషయాన్ని డాక్టర్లు పలు పరీక్షలు చేసి ధ్రువీకరించారు. సదరం సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. గత పదిదేళ్లు దివ్యాంగుల పింఛన్‌ను తీసుకుంటున్నా. ఇటీవల కొంతమంది ఉద్యోగులు ఇంటికొచ్చి అర్హత పరీక్ష అని చెప్పారు. తర్వాత ఎలాంటి పరీక్షలు చేయలేదు. ఏదో రాసుకుని వెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత పింఛన్ రూ.6 వేలకు తగ్గిస్తున్నామని నోటీసు ఇచ్చారు. నాలాంటోళ్ల కడుపు కొట్టి పింఛన్‌లో కోత విధించడం అన్యాయం. మాకున్న అర్హతను బట్టే కదా ఇన్ని రోజులు పింఛన్‌లు ఇచ్చారు. ఇప్పుడెందుకు కొత్త నిబంధనలు పెట్టి అన్యాయంగా కోతలు కోస్తున్నారు..? – ఏకాంబరం,
పుల్లూరు గ్రామం, ఐరాల మండలం.
జిల్లాలో పలువురి పింఛన్ల తొలగింపు
ఇప్పటికే నోటీసులు జారీ
కన్నీరుమున్నీరవుతున్న అభాగ్యులు
పట్టించుకోని కూటమి నేతలు
మాపై ఎందుకింత కక్ష?
రూ.6 వేలకు తగ్గించేశారు
దివ్యాంగులపై
కూటమి కక్ష
కూటమి ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతోంది. పింఛన్ సొమ్ముతో బతుకులీడుస్తున్న దివ్యాంగులను ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. రీవెరిఫికేషన్ పేరుతో చుక్కలు చూపిస్తోంది. పింఛన్లు తొలగించి వారి పొట్టగొట్టేందుకు పన్నాగం పన్నింది. ఇక తాము ఎలా బతికేది దేవుడా..! అంటూ పలువురు నిట్టూర్పులు వెళ్లగక్కాల్సి వస్తోంది. కుటుంబానికి భారం కాకుండా ఇన్నాళ్లూ బతికామని, ఇక తమకు చావే శరణ్యమని దివ్యాంగులు గగ్గోలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. నడవలేని స్థితిలో ఉన్నా కలెక్టరేట్, మండల కేంద్రాలకెళ్లి గళమెత్తాల్సి వస్తోంది. అయినా కూటమిలో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
– చిత్తూరు కలెక్టరేట్/ నగరి
1/1
విలపింఛన్