
గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా!
చౌడేపల్లె: గంగమ్మ తల్లీ... కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించమ్మా..! అంటూ కొండామర్రి గ్రామంలో వెలసిన గ్రామదేవత నడివీధి గంగమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఎంపీటీసీ షాహీనల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేక పూజలు చేశారు. నాగభూషణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి కూటమి వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు షంషీర్, హస్సేన్, శ్రీరాములు, టి.నాగరాజ, జీఆర్‌ఎస్ రమణ, సాధిక్, గిరిబాబు, మునికృష్ణమనాయుడు, చెంగారెడ్డి, రంగనాథ్, మోహన్‌రెడ్డి, బాబు, భరత్‌రెడ్డి తదితరు పాల్గొన్నారు.