
ఎంపీ మిథున్‌రెడ్డి విడుదలవ్వాలని పూజలు
వి.కోట: ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని ఆయన అభిమాని అన్నవరం శ్రీ రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మేజర్ పంచాయతీ 5వ వార్డు మెంబరు కుమార్‌రాజా ఈ నెల 19వ తేదీన స్థానిక శ్రీవీరాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన బైక్‌పై దాదాపు 980 కి.మీ ప్రయాణించి అన్నవరానికి చేరుకున్నారు. అక్కడ ఎంపీ మిథున్‌రెడ్డి త్వరగా విడుదలవ్వాలని ప్రత్యేక పూజలు చేశారు. కుమార్‌రాజా గతంలోనూ మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. తర్వాత జగనన్నను కలిసి తిరుమలకు వెళ్లి మొక్కు చెల్లించారు. కుమార్‌రాజా మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. ఇందులో భాగంగానే ఆయన తనయుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించినట్టు ఆరోపించారు.
అన్నవరంలో మిథున్‌రెడ్డి ఫొటోతో కుమార్‌రాజా, గత సోమవారం అన్నవరానికి బయల్దేరుతూ..

ఎంపీ మిథున్‌రెడ్డి విడుదలవ్వాలని పూజలు