
కూటమి నేతల బారి నుంచి రక్షించండి
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి సానుభూతిపరుల దౌర్జన్యం పెచ్చుమీరుతోందని, వారి బారి నుంచి తమను రక్షించాలని యాదమరి మండలం, లగడపాటూరు గ్రామానికి చెందిన చిన్నబ్బ ఆవేదన వ్యక్తం చేసారు. భాదితుని కథనం.. తమ గ్రామంలో సర్వే నం.29–8బీలో పూర్వీకుల నుంచి వ్యవసాయం చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అయితే అదే గ్రామానికి చెందిన కూటమి సానుభూతిపరుడు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం కుమారులు తమ పొలంలోకి వెళ్లనివ్వకుండా అడ్డగిస్తున్నారు. శుక్రవారం ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తరలించి పొలం మధ్యలో దారి ఏర్పాటుకు యత్నించారు. దీనిపై ప్రశ్నిస్తే మాజీ సర్పంచ్ కుమారులు రుద్రయ్య, శివకుమార్ తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై డయల్ 100 కాల్ చేయగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఆపై కొద్దిసేపటికే జేసీబీ యంత్రాలతో పనులు మొదలు పెట్టారని చెప్పారు. దీనిపై తహసీల్దార్ స్పందించి న్యాయం చేయాలని కోరారు.