వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలి

Aug 21 2025 6:52 AM | Updated on Aug 21 2025 6:52 AM

వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలి

వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలి

చిత్తూరు కార్పొరేషన్‌ : తపాలా ఉద్యోగుల వేతన సవరణకు ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని తపాలా శాఖ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా శాఖ కార్యాలయం ఎదుట బుధవారం ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో నాయకులు భాస్కర్‌ మాట్లాడుతూ గ్రామీణ డాక్‌ సేవక్‌లు, పెన్షనర్‌లందరికీ వేతన సవరణతో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిదో వేతన సవరణలో పెన్షనర్లకు సవరణ చేయబోమని ప్రకటించడం దారుణమన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ ధర్నాలో నాయకులు రామమూర్తి, అరుణ, మహదేవన్‌, దామోదర, హరిప్రసాద్‌, సురేంద్ర, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement