
వి.కోటలో చైన్ స్నాచింగ్
వి.కోట: మహిళ మెడలోని బంగారుచైన్‌ను గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లిన సంఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన అమరావతి అనే మహిళ స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో హెల్పర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్థానిక వేణుగోపాల స్వామి వీధిలోని ప్రాథమిక పాఠశాల వద్దకు నడుచుకుని వెళుతుండగా ఆమెను బైక్‌పై వెంబండించిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులలో డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించి,వెనక కూర్చున్న వ్యక్తి తలకు టోపీ, కళ్లాద్దాలు ధరించి ఉన్నారని బాధితురాలు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.