
జాతీయస్థాయి కథల పోటీల్లో చిత్తూరు విద్యార్థిని ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి కథల పోటీల్లో తమ పాఠశాల విద్యార్థిని సాయిరెడ్డి ఉదితి ప్రతిభ చూపి, బహుమతి సాధించినట్లు దేవీబాలామందిర్ పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రనాథ్ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వురిమళ్ల ఫౌండేషన్ (ఖమ్మం) ఆధ్వర్యంలో జాతీయస్థాయి కథలు, కవితల పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఉదితి రాసిన మన భరతమాత (దేశభక్తి) కథ జాతీయ స్థాయిలో ఎంపికై ందన్నారు. ఈ కథను సంకలనంగా ముద్రిస్తారని వురిమళ్ల ఫౌండేషన్ నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం ఆ విద్యార్థినిని హెచ్‌ఎం సుజాత, టీచర్లు అభినందించారు.