
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
బంగారుపాళెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకురాలు, మండల ప్రత్యేక అధికారి పద్మమ్మ అన్నారు. బుధవారం బంగారుపాళెం, పాలేరు, తుంబకుప్పం గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందిస్తున్నారా? లేదా అని ఆరా తీశారు. అంగన్‌వాడీ పిల్లల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. తుంబకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్‌సీకి రోజూ ఎంత మంది రోగులు వస్తున్నారు.. వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలో ముందుల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లోకేష్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు షామీదాబేగం, కవిత తదితరులు పాల్గొన్నారు.