
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవ పోస్టర్‌ను ఇన్‌చార్జ్ డీఎంఅండ్‌హెచ్ వెంకట ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తారన్నారు. మండల వైద్యాధికారులు విధిగా పీహెచ్‌సీల పరిధిలో దోమల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. దోమల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.