
కలెక్టర్ ఆగ్రహం
చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ లైన్‌మన్(జేఎల్‌ఎం గ్రేడ్–2) సంఘం నాయకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు జేఎల్‌ఎం నాయకులు వెళ్లారు. ఉన్నత కొలువులు పొందడానికి శిక్షణ కోసం రాత్రి పూట శిక్షణకు అనుమతివ్వాలని కోరారు. అక్కడే ఉన్న జేసీ విద్యాధరి గతంలో సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని, అత్యవసర సేవల్లో పనిచేస్తున్న వారికి రాత్రివేళ్ల శిక్షణకు దీర్ఘకాలిక అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పామన్నారు. కావాలంటే సెలవు పెట్టుకొని శిక్షణ తీసుకోవచ్చని సూచించినట్టు వెల్లడించారు. దీనిపై కలెక్టర్ కల్పించుకుని సంబంఽధిత అధికారులతో విషయం మాట్లాడినా కొత్తగా తిరిగి సమస్యను తనకు తెలపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అధికారులు అనుమతివ్వడం లేదని జెఎల్‌ఎంగ్రేడ్–2 సంఘం నాయకులు చెప్పడం పై అసహనం వ్యక్తం చేశారు. వారిని వెంటనే బయటకు పంపాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ని పిలిచి ఇక్కడకొచ్చేందుకు జేఎల్‌ఎంలు అనుమతి, లేదా సెలవు తీసుకున్నరా..? అని ప్రశ్నించారు. తీసుకోలేదని ఆయన చెప్పడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు నలుగురి నాయకుల పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఎస్‌ఈ వివరించారు.
ఎన్జీఓ కార్యవర్గం
ఏకగ్రీవం
చిత్తూరు కార్పొరేషన్: సిటీ(వాణిజ్య పన్నులు) శాఖ చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎన్జీఓ(నాన్ గెజిటెడ్ అధికారుల) సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మంగళవారం చిత్తూరులో నిర్వహించిన ఆ సంఘ సమావేశంలో కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. రెండు జిల్లాల అధ్యక్షుడిగా ఎ.రాజేష్, అసోసియేట్ అధ్యక్షుడుగా దశరథన్, ఉపాధ్యక్షులుగా బి.సురేష్‌కుమార్‌రెడ్డి, పి.గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీధర్, కార్యాలయ కార్యదర్శిగా వి.పురుషోత్తంనాయుడు, సహాయ కార్యదర్శులుగా కె.రెడ్డిప్రసాద్, సి.జ్యోష్ణ, కోశాధికారిగా జ్ఞానవేల్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా ఏపీ ఎన్టీఓ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు కేవీ రాఘవు పాల్గొన్నారు. వీరి పదవీ కాలం మూడేళ్లు ఉంటుందని నాయకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు వివరించారు.