
న్యాయం గెలుస్తుంది
● జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి
చిత్తూరు కార్పొరేషన్: ఎప్పటికై నా న్యాయం గెలుస్తుందని వైఎస్‌ఆర్ సీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి తెలిపారు. మంగళవారం రాత్రి బెయిల్‌పై బయటకు వచ్చిన చిత్తూరు, జీడీనెల్లూరు, వి.కోటకు చెందిన కార్యకర్తలు చక్రవర్తి, వినోద్, మోహన్, శంకరాచారితో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా జైలు వద్ద వారితో మాట్లాడి, భరోసానిచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్యాయంపై ప్రశ్నించిన వారిని కేసుల పెట్టి వేధిస్తోందన్నారు. ఆ దిశగానే తన సోదర సమానులైన పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టారన్నారు. జరుగుతున్న అన్యాయాలను భగవంతుడు, ప్రజలు చూస్తున్నారన్నారు. భవిష్యత్‌లో చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తారన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, వారి కష్టాలను జగనన్న దృష్టికి ఎప్పటికప్పుడు నాయకులు తెలియజేస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడే పరిస్థితి లేదన్నారు. వైఎస్‌ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి నాయకులు అంజలిరెడ్డి, హరీషారెడ్డి, మధురెడ్డి, రాజేష్‌రెడ్డి, మురళీరెడ్డి, అన్బు, ఆను, చామంతి, వెంకట్‌రెడ్డి, గురువారెడ్డి, గుణశేఖర్‌రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.