● జిల్లాలో ఉచిత బస్సులు అరకొరే ● సిటీ బస్సులు, అల్ట్రాడీలక్స్‌లు శూన్యం ● పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ కోతలే ● అరకొర సేవలతోనే ఉచిత బస్సు పథకం | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో ఉచిత బస్సులు అరకొరే ● సిటీ బస్సులు, అల్ట్రాడీలక్స్‌లు శూన్యం ● పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ కోతలే ● అరకొర సేవలతోనే ఉచిత బస్సు పథకం

Aug 19 2025 5:22 AM | Updated on Aug 19 2025 5:22 AM

● జిల్లాలో ఉచిత బస్సులు అరకొరే ● సిటీ బస్సులు, అల్ట్రాడ

● జిల్లాలో ఉచిత బస్సులు అరకొరే ● సిటీ బస్సులు, అల్ట్రాడ

● జిల్లాలో ఉచిత బస్సులు అరకొరే ● సిటీ బస్సులు, అల్ట్రాడీలక్స్‌లు శూన్యం ● పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ కోతలే ● అరకొర సేవలతోనే ఉచిత బస్సు పథకం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో కోతలు పెడుతోంది. నాలుగు రకాల సర్వీసుల్లో ఉచితమని చెప్పి, తీరా షరతులు విధిస్తోంది. జిల్లాలో సిటీ బస్సులు, అల్ట్రా డీలక్స్‌ సర్వీసులు లేవు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ అంత రాష్ట్ర సర్వీసుల పేరుతో కోతలు పెట్టింది. సరిహద్దుల్లో ఉచిత బస్సు తుస్స్‌మంటోంది. రాయితీ పేరుతో టికెట్‌ వసూలు చేస్తోంది. సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టేసింది. కండక్టర్లు ఉచితమంటే మహిళలపై చిర్రెత్తిపోతున్నారు. ఊరించిన ఉచిత బస్సు పథకం ఉసురుమనిపిస్తోంది.

అరకొరగా సీ్త్రశక్తి

జిల్లాలోని 5 డిపోల పరిధిలో మొత్తం 461 బస్సు లున్నాయి. ఇందులో పల్లె వెలుగు బస్సులు 246, ఎక్స్‌ప్రెస్‌ 73, ఏసీ బస్సులు 4, సూపర్‌ లగ్జరీ 32, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ 35, అద్దె బస్సులు 71 వరకు ఉన్నాయి. వీటిలో నిత్యం సుమారు 1.20 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చింది. దీంతో చాలావరకు బస్సులు తారుమారు అయ్యాయి. ఎక్స్‌ప్రెస్‌ బస్సులు వెళుతున్న మార్గాల్లో సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను తిప్పుతున్నారు. పలు ఎక్స్‌ప్రెస్‌ బస్సులపై అంతరాష్ట్ర సర్వీసు అనే బోర్డు పెట్టేశారు. దీంతో ఉన్న బస్సుల్లో కోత పెట్టారు. పల్లె వెలుగు బస్సులను సైతం అంతరాష్ట్ర సర్వీసులుగా తిప్పుతూ, వాటిలో చాలా వరకు షరతులు పెట్టేశారు. దీంతో జిల్లాలో సీ్త్ర శక్తి పథకం అరకొరగా అమలవుతోంది.

బస్సులు అరకొరే..

కూటమి ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన సాయంత్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం శనివారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. అయితే ఆ పథకంలో పెట్టిన షరతులతో మహిళా ప్రయాణికులు ఆయోమయంలో పడుతున్నారు. జిల్లాలోని 5 ఆర్టీసీ డిపోల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు మొత్తం 319 ఉండగా.. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 246 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లెవెలుగు 27 బస్సులు, ఎక్స్‌ప్రెస్‌ 45 బస్సులు మొత్తం 73 బస్సులు అంతరాష్ట్ర సర్వీసుల పేరుతో తిప్పుతున్నారు. బెంగళూరు, తమిళనాడులోని వేలూరు, తిరుత్తణి, పొన్నై, కృష్ణగిరి, చెన్నె, తిరువణ్ణామలై తదితర ప్రాంతాలకు తిరుగుతున్నాయి.

సరిహద్దులో ఉచితం లేదా..?

సరిహద్దు ప్రాంతాల్లోని ప్రయాణికులు ఉచితానికి దూరమవుతున్నాయి. కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం, నగరి, పుత్తూరు, చిత్తూరు, గుడిపాల, యాదమరి, కుప్పం, వి.కోట, రామకుప్పం, పలమనేరు, శాంతిపురం, తదితర ప్రాంతాల్లో ఉచితానికి బదులు రాయితీలు ఇస్తున్నారు. దీంతో మహిళలు ఉచిత పథకంపై విరుచుకుపడుతున్నారు.

టికెట్‌ తీసుకో.. బస్సెక్కు..

టికెట్లు తీసుకుంటేనే ఈ బస్సులో ఎక్కాలని కండక్టర్లు చెప్పడంతో మహిళలు బస్సు దిగేస్తూ.. కూటమి ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడడం కనిపించింది. వెంటనే అదే మార్గంలో నడిచే మరో ఎక్స్‌ప్రెస్‌ బస్సును ప్లాట్‌ఫాంపైకి తెచ్చారు. ప్రయాణికులు అందులో ఎక్కేందుకు ప్రయత్నించగా ఈ బస్సులో మహిళలు టికెట్లు తీసుకోవాలంటూ కండక్టర్‌ చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అదేంటి ఇది ఎక్స్‌ప్రెస్‌.. అది ఎక్స్‌ప్రెస్‌ కదా? అని బస్సు సిబ్బందిని అడిగితే మాకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు. ప్రధాన స్టాపింగ్‌లో దిగేందుకు కూడా సీ్త్రశక్తి పథకం వర్తించదంటున్నారు. సాయంత్రం వేళ్లల్లో మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కండక్టర్లు బస్సు ఎక్కనివ్వడం లేదు. టికెట్లు తీసుకోవాలని చెబుతున్నారు. మహిళలను ఛీకొడుతున్నారు. పల్లె వెలుగు బస్సులు ఫుల్‌ అయితే డొక్కు బండమ్మా..తట్టుకోలేదంటూ వెళ్లిపోతున్నారు.

జిల్లాలోని ఆర్టీసీ బస్సులో రోజువారీగా సుమారు 1.20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటే.. ఇందులో అత్యధికంగా మహిళలే ఉన్నారు. 50నుంచి 60 శాతం మంది మహిళలు, 30నుంచి 40 శాతం పురుషులు, 10నుంచి 20 శాతం విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు లెక్క లు చెబుతున్నారు. ప్రధానంగా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సప్తగిరి సర్వీసులనే ప్రయాణం సాగిస్తున్నారని పరిశీలనలో గుర్తించినట్లు చెబుతున్నారు. అయినా మహిళలకు ఉచిత పథకం పథకం అరకొరగానే అందుతోంది.

ప్రయాణంలో మహిళలే అధికం

సప్తగిరి పేరుతో గోల్‌మాల్‌

కాణిపాకం నుంచి తిరుపతికి గతంలో ఎక్స్‌ప్రెస్‌ నడిచేది. ఉచిత బస్సు పథకం అమలుతో దాని స్థానంలో సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ నడుపుతున్నారని కాణిపాకం వాసులు మండిపడుతున్నారు. అలాగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ అన్‌పిట్‌ కావడంతో వాటిని పల్లె వెలుగు కింద మార్చేశారు. కానీ వాటికి పల్లె వెలుగు పెయింటింగ్‌ వేయకుండా అలానే తిప్పుతున్నారు. ఈ బస్సుల్లో ఉచితం ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అన్‌ఫిట్‌ అయిన బస్సులు 9 వరకు కుప్పంలో తిప్పుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement