
బాబుపాలనలో మోసం గ్యారెంటీ
పుంగనూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసగించడం మాత్రం గ్యారెంటీ అని, అలాంటి చంద్రబాబును నమ్మవద్దని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ప్రజలను కోరారు. సోమవారం పట్టణంలోని కట్టకిందపాళెంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణంతో కలసి బాబు షూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విడుదల చేసిన స్కానర్లు, క్యూఆర్‌కోడ్ పోస్టర్లను ప్రజలకు పంపిణీ చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, మున్సిపల్ వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అమరేంద్ర, కౌన్సిలర్లు కాంతమ్మ, గంగులమ్మ, భారతి, పూలత్యాగరాజు, రెడ్డెమ్మ, రేష్మా, భారతి, నూర్జహాన్, సాజిదాబేగం, నటరాజ, కాళిదాసు, కిజర్‌ఖాన్, జెపి.యాదవ్, నాయకులు ఎస్‌వీటీ.సోము, ఎస్‌వీటీ కిషోర్, రాజేష్, అస్లాంమురాధి తదితరులు పాల్గొన్నారు.