
డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు అవకాశం కల్పించారని జిల్లా నోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18వ తేదీ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. ఇంటర్ ఉ త్తీర్ణత చెందిన విద్యార్థులు ఈ అడ్మిషన్ల ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, ఎలక్ట్రానిక్స్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్లు పొందాలన్నారు. సందేహాల నివృత్తికి బీఏ(9494368020), బీకాం (9849959423), బీఎస్సీ (9985165051) నెంబర్‌లలో సంప్రదించాలని ఆమె కోరారు.