
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు గంగమ్మగుడి విద్యార్థ
శ్రీరంగరాజపురం: జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు మండలంలోని గంగమ్మగుడి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి ఎన్.మధు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి సోమవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మధు పాల్గొని, ఉత్తమ ప్రతిభను కనబరచడంతో జాతీయస్థాయి సబ్ జూనియర్ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. కాగా ఈనెల 22 నుంచి 24 వరకు బిహార్‌లోని బుద్ధగయాలో జరిగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టులో ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మధును ఉపాధ్యాయులు లోకనాథం, బాలాజీ, చంద్రశేఖర్, బాబు, పద్మశ్రీ, సత్య, జానకి, సరోజమ్మ, ప్రసన్నకుమారి, అరుణ అభినందించారు.