బోయకొండ పాలకమండలికి 13 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

బోయకొండ పాలకమండలికి 13 దరఖాస్తులు

Aug 19 2025 4:44 AM | Updated on Aug 19 2025 4:44 AM

బోయకొండ పాలకమండలికి 13 దరఖాస్తులు

బోయకొండ పాలకమండలికి 13 దరఖాస్తులు

చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ నూతన పాలకమండలి సభ్యత్వానికి 13 మంది సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఈ నెల7వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం చౌడేపల్లె మండలం ఎర్రగానిపల్లెకు చెందిన ఎం.లక్ష్మణ్‌రాజు(పతిరాజు), పాలక మండలి సభ్యత్వానికి మరో 12 మంది టీడీపీ నేతలతో కలిసి దరఖాస్తులను ఆలయ పరిపాలన కార్యాలయంలో ఈఓకు అందజేశారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని, ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరమణరాజు, ప్రదీప్‌రాజు, సీవీ రెడ్డి, మాధవరెడ్డి, హరిప్రసాద్‌, కార్తీక్‌, ప్రహ్లద, రెడ్డిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement